LOADING...
Mobile internet: మణిపూర్‌లో నవంబర్ 5 వరకు మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేదం
మణిపూర్‌లో నవంబర్ 5 వరకు మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేదం

Mobile internet: మణిపూర్‌లో నవంబర్ 5 వరకు మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేదం

వ్రాసిన వారు Stalin
Nov 01, 2023
06:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. దీంతో సంఘ విద్రోహుల ద్వారా హానికరమైన సందేశాలు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని నవంబర్ 5వరకు పొడిగించింది. మణిపూర్ 3న హింస చెలరేగిన తర్వాత నుంచి రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ నిషేదం అమల్లో ఉంది. కొద్ది రోజుల్లో నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఇటీవల ప్రకటించారు. కానీ, ఈ లోపే మళ్లీ రాష్ట్రంలో హింస చెలరేగడంతో నిషేదాన్ని పొడిగించాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇంటర్నెట్‌ను పునరుద్ధరించే అవకాశాలు కనిపించడం లేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మణిపూర్ మే 3నుంచి మొబైల్ ఇంటర్నెట్ బంద్