LOADING...
మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో 5.1 తీవ్రతతో భూకంపం  
మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో 5.1 తీవ్రతతో భూకంపం

మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో 5.1 తీవ్రతతో భూకంపం  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2023
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం 5.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్ సీఎస్) తెలిపింది. NCS ప్రకారం, సోమవారం రాత్రి 11.01 గంటలకు, 20 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని ఎన్ సీఎస్ తెలిపింది. ఈ ఏడాది జులై 21న ఉఖ్రుల్ లో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించగా..తాజాగా మరో సారి మంగళవారం అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదు అయింది. ఎన్ సీఎస్ వివరాల ప్రకారం..మంగళవారం తెల్లవారుజామున 3.39 గంటలకు భూకంపం సంభవించిందని, 93 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉఖ్రుల్ జిల్లాలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్