Page Loader
Manish Sisodia : 17 నెలల తర్వాత భార్యతో కలిసి ఇంట్లో టీ తాగుతున్నా : మనీష్ సిసోడియా
17 నెలల తర్వాత భార్యతో కలిసి ఇంట్లో టీ తాగుతున్నా : మనీష్ సిసోడియా

Manish Sisodia : 17 నెలల తర్వాత భార్యతో కలిసి ఇంట్లో టీ తాగుతున్నా : మనీష్ సిసోడియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 10, 2024
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనీలాండరింగ్ ముడిపడిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టుయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా 17 నెలల తర్వాత జైలు విడుదలైన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం తన ఇంట్లో భార్యతో కలిసి టీ తాగుతున్న ఫోటోను ఆయన 'ఎక్స్' వేదికగా తొలి పోస్టు చేశారు. 17 నెలల తర్వాత తన భార్యతో కలిసి ఇంట్లో తాగుతున్నానని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. భారతీయులందరికీ రాజ్యాంగం స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించిందని ఆయన రాసుకొచ్చారు.

Details

సిసోడియా సతీమణి ఆరోగ్యంపైనే దృష్టి

ప్రతి ఒక్కరితో కలిసి స్వేచ్ఛా వాయువులు పీల్చుకొనే హక్కును ఆ దేవుడి మనందరికి ఇచ్చారని సిసోదియా పోస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం సిసోడియా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. గతంలో సీబీఐ అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత సిసోడియా ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన ఇప్పటికప్పుడు డిప్యూటీ సీఎం పదవిని చేపట్టబోరని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సిసోడియా సతీమణి ఆరోగ్యం సరిగా లేదని, ఆమె ఆరోగ్యం పైనే ఆయన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.