
Manu Bakar: యువతకు ఆదర్శంగా మను బాకర్.. హర్యానా ఎన్నికల్లో తొలిసారి ఓటేసిన స్టార్ షూటర్
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం 90 స్థానాలకు ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
తొలి గంటల్లోనే ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటర్లలో చైతన్యాన్ని పెంచారు.
పారిస్ ఒలింపిక్స్ డబుల్ పతక విజేత, స్టార్ షూటర్ మను బాకర్ తన కుటుంబంతో కలిసి ఝజ్జర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికల్లో ఆమె తొలిసారిగా ఓటు వేయడం విశేషం. దేశ యువతగా ఓటు వేయడం మనందరి బాధ్యత అనిని ఆమె పేర్కొన్నారు.
Details
ఓటు హక్కును వినియోగించుకున్న వినేశ్ ఫోగాట్
కర్నాల్‌లో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఓటు వేస్తూ, ఈ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగాట్ చర్కి దాద్రిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కురుక్షేత్రలో తన ఓటు హక్కును వినియోగించగా, హర్యాానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ అంబాలాలో ఓటు వేసి, తమ ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఫరీదాబాద్‌లో కేంద్రమంత్రి కృషణ్ పాల్ గుర్జార్, సిర్సాలో మాజీ ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌటాలా కూడా తమ ఓటు హక్కు వినియోగించారు.