
HMDA: మహానగరానికి ఉత్తరాన సరికొత్త వెలుగులు.. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పలు ప్రాజెక్టులు
ఈ వార్తాకథనం ఏంటి
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కొత్త ఎలివేటెడ్ కారిడార్లతోపాటు మెట్రో విస్తరణకు రంగం సిద్ధమవుతోంది.
ప్యారడైజ్ నుంచి ఎన్‌హెచ్-44లోని డైయిరీ ఫాం వరకు మరో డబుల్‌డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ రానుంది.
శామీర్‌పేట్ వరకు మెట్రో విస్తరణ ప్రణాళికలు అమలులో ఉన్నాయి.ఈ రెండు ప్రధాన రహదారులు నగరంలోని ఉత్తర భాగంలో స్థిరాస్తి రంగాన్ని పూర్తిగా మార్చివేయనున్నాయి.
ప్రస్తుతం పశ్చిమ వైపు ఈ రంగం ఎక్కువగా అభివృద్ధి చెందుతోంది. కోకాపేట్‌లో హెచ్‌ఎండీఏ భూమి వేలంలో ఒక్క ఎకరం రూ.100 కోట్లు పలికింది.
అవుటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్), ఎయిర్‌పోర్ట్ అనుసంధానం, ఐటీ కారిడార్ కారణంగా భూములపై భారీ డిమాండ్ ఉంది.
వివరాలు
ఈ ప్రాజెక్టులు ఏమిటో చూద్దాం:
ఈ కొత్త రహదారుల వల్ల ఉత్తర భాగంలోనూ స్థిరాస్తి మార్కెట్ విస్తరించి,అభివృద్ధి చెందుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మెరుగైన రవాణా అనుసంధానం ప్రజలకు ప్రయోజనం కలిగిస్తే,స్థిరాస్తి మార్కెట్ పెరుగుదలకు దోహదం చేస్తుందని నిపుణుల అభిప్రాయం.
ఎలివేటెడ్ కారిడార్ (ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు)
మొత్తం దూరం:18.124 కిలోమీటర్లు
ప్రాజెక్టు వ్యయం:రూ.3619 కోట్లు
ప్రైవేటు భూమి అవసరం: 163 ఎకరాలు భూసేకరణ
పరిహారం: రూ.1565.65 కోట్లు
ప్రస్తుత పరిస్థితి: హైదరాబాద్,మేడ్చల్ కలెక్టర్లు ప్రైవేట్ భూమి సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. స్థలాల విలువ మదింపు ప్రక్రియ కొనసాగుతోంది.రక్షణ శాఖ భూ సేకరణ కొలిక్కి వచ్చింది.మార్చిలో టెండర్లు పిలిచేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తోంది.డిజైన్‌లో మార్పులు చేసి,కింద రహదారి, పైన మెట్రో నిర్మాణం చేయనున్నారు.
వివరాలు
డబుల్‌డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్
2. డబుల్‌డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ (ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైయిరీ ఫాం రోడ్డు వరకు - ఎన్‌హెచ్-44 అనుసంధానం)
మొత్తం దూరం: 5.320 కిలోమీటర్లు
ప్రాజెక్టు వ్యయం: రూ.1487 కోట్లు
ప్రైవేటు భూమి అవసరం: 55 ఎకరాలు భూసేకరణ
పరిహారం: రూ.357.03 కోట్లు
ప్రస్తుత పరిస్థితి: హైదరాబాద్,మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు.రైట్ ఆఫ్ వే కోసం ఇరువైపులా 200 మీటర్ల భూమి సేకరించనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద అండర్‌గ్రౌండ్ టన్నెల్ నిర్మాణ అనుమతుల కోసం
**ఏఏఐ (ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా)**కు హెచ్‌ఎండీఏ విజ్ఞప్తి చేసింది. రక్షణ శాఖ భూ సేకరణ పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌లో కింద రెండు వరుస రహదారి, పై మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
వివరాలు
గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్
3. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ (ఓఆర్‌ఆర్ రావిర్యాల్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ ఆమనగల్లు వరకు)
ఫేజ్ 1: (ఓఆర్‌ఆర్ రావిర్యాల్ నుంచి మీర్‌ఖాన్‌పేట్ - ఫోర్త్ సిటీ వరకు)
దూరం: 18 కిలోమీటర్లు
వ్యయం: రూ.1665 కోట్లు
భూమి అవసరం: 447.29 ఎకరాలు భూసేకరణ
ఖర్చు: రూ.246 కోట్లు
ప్రస్తుత పరిస్థితి: భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి, సర్వే ప్రక్రియ పూర్తయింది.
ఫేజ్ 2: (మీర్‌ఖాన్‌పేట్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ (ఆమనగల్లు) వరకు)
దూరం: 23.50 కిలోమీటర్లు
వ్యయం: రూ.2365 కోట్లు
భూమి అవసరం: 586.63 ఎకరాలు
భూసేకరణ ఖర్చు: రూ.345 కోట్లు
ప్రస్తుత పరిస్థితి: భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది.