LOADING...
Guntur: త్వరలో తెలుగుదేశం పార్టీలోకి మర్రి రాజశేఖర్‌
త్వరలో తెలుగుదేశం పార్టీలోకి మర్రి రాజశేఖర్‌

Guntur: త్వరలో తెలుగుదేశం పార్టీలోకి మర్రి రాజశేఖర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2025
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాంటి షరతులు లేకుండానే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్‌ స్పష్టం చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ''వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎదురైన అవమానాలను తట్టుకోలేకనే, ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉన్నప్పటికీ, నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. వైకాపా నుంచి రాజీనామా చేసిన తరువాతే కొత్త పార్టీలో చేరుతున్నాను. పార్టీ నాయకుడు తన హామీలను నిలబెట్టుకోలేకపోయారు. ఇక పార్టీకి నేను అవసరం లేనట్టుగా వ్యవహరించారు. 14 ఏళ్లుగా పనిచేసిన పార్టీలో కనీస గౌరవం మాత్రమే ఆశించాను,'' అని వివరించారు.