LOADING...
PM Modi: అఫ్గానిస్థాన్ భారీ భూకంపం.. ఆదుకునేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది : మోదీ
అఫ్గానిస్థాన్ భారీ భూకంపం.. ఆదుకునేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది : మోదీ

PM Modi: అఫ్గానిస్థాన్ భారీ భూకంపం.. ఆదుకునేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది : మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2025
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

అఫ్గానిస్థాన్‌లో ఘోర భూకంపం సంభవించడంతో వందలమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. ఈ విపత్తులో కుటుంబసభ్యులను, సన్నిహితులను కోల్పోయిన వారికి శక్తినివ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించారు. భూకంపం ధాటికి నష్టపోయిన అఫ్గాన్‌కు అన్ని రకాల మానవతా సాయం అందించి ఆ దేశాన్ని ఆదుకునేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో ఆదివారం అర్ధరాత్రి 11.47 గంటల సమయంలో అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది.

Details

800 మందికి పైగా మృతి

ఈ ఘోర విపత్తు కారణంగా 800 మందికి పైగా మరణించారని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్‌ అఫ్గానిస్థాన్‌ తెలిపింది. అంతేకాక 2,500 మందికి పైగా గాయపడ్డారని కూడా వెల్లడించారు. భూకంపం కారణంగా వర్దాక్‌ ప్రావిన్స్‌లోని పలు గ్రామాల్లో ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని మాజీ మేయర్ జరీఫా ఘఫ్పారీ పేర్కొన్నారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉందని, అసమర్థ తాలిబాన్‌ ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టలేదని తెలిపారు. ఈ సమయంలో అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.