Page Loader
Maharashtra: జల్గావ్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. 17మందికి పైగా కార్మికులకు గాయాలు
జల్గావ్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. 17మందికి పైగా కార్మికులకు గాయాలు

Maharashtra: జల్గావ్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. 17మందికి పైగా కార్మికులకు గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2024
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లో 17 మందికి పైగా కార్మికులు గాయపడగా ఒకరు మృతి చెందారు. సమాచారం ప్రకారం, ఇంకా చాలా మంది కార్మికులు ఫ్యాక్టరీలో చిక్కుకున్నారు. అగ్నిప్రమాదానికి ముందు పెద్ద పేలుడు సంభవించినట్లు సమాచారం. ఆ తర్వాత ఫ్యాక్టరీ మొత్తం మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో పలువురు కార్మికులు ఉండగా, చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మంటలను ఆర్పేందుకు యత్నాలు కొనసాగుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 జల్గావ్‌లో రెండు ఫ్యాక్టరీలలో అగ్నిప్రమాదం