Fire Accident: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న తల్లి, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు
ఈ వార్తాకథనం ఏంటి
నాంపల్లి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాపులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. నాలుగు అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో మొదలైన అగ్ని ప్రమాదం క్రమంగా ఉద్ధృతంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ నాలుగు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టింది. భవనానికి సమీపంగా భారీ క్రేన్లను కూడా మోహరించారు. ఈ ఘటన సమయంలో భవనంలో ఆరుగురు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అందులో ఒక తల్లి, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
Details
స్థానికుల్లో తీవ్ర ఆందోళన
పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అధికారులు పరిసర ప్రాంత ప్రజలను సురక్షితంగా బయటకు తరలిస్తున్నారు. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అగ్నిప్రమాద ప్రాంతంలో పోలీసులు, హైడ్రా, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందించేందుకు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. భవనం చుట్టూ దట్టమైన పొగ వ్యాపించడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రమాద తీవ్రత మరింత పెరగకుండా ఉండేందుకు భవనం సమీపంలోని ప్రమాదకర వస్తువులను స్థానికుల సహకారంతో అధికారులు తొలగిస్తున్నారు.