Page Loader
Chhattisgarh: రాయ్‌పూర్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో నివాసితులు
రాయ్‌పూర్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలో భారీ అగ్నిప్రమాదం

Chhattisgarh: రాయ్‌పూర్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో నివాసితులు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 05, 2024
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని కోట ప్రాంతంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా విద్యుత్ పంపిణీ సంస్థలో మంటలు అంటుకుని పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమీప ప్రాంతాలు దట్టమైన పొగతో కమ్ముకున్నాయి.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థకు సమీపంలో మంటలు విస్తరించడంతో సమీప నివాస ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. నివాసితులు వారి భద్రత గురించి ఆందోళన చెంది,తమ ఇళ్లను ఖాళీ చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు.

Details 

మంటలలో ట్రాన్స్‌ఫార్మర్లు

విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు మంటల్లో కాలిపోతున్నాయి. కాగా, ఎండ ఎక్కువగా ఉండడంతో మంటలు భారీగా అంటుకున్నట్లు తెలుస్తోంది. మంటలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేది అధికారులు ఇంకా ఏమీ వెల్లడించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.