Page Loader
Cyber Crime: డిజిటల్ ట్రేడింగ్ ముసుగులో భారీ మోసం.. 52 మంది అరెస్టు
డిజిటల్ ట్రేడింగ్ ముసుగులో భారీ మోసం.. 52 మంది అరెస్టు

Cyber Crime: డిజిటల్ ట్రేడింగ్ ముసుగులో భారీ మోసం.. 52 మంది అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ నగరంలో డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు. బ్యాంకు మేనేజర్‌ సహా 52 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి వందల సంఖ్యలో చెక్‌బుక్‌లు, సెల్‌ఫోన్లు, రబ్బర్‌ స్టాంపులు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠా మూడు విధాలుగా సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల్లో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

Details

డిజిటల్

ఫేస్‌ బుక్ బ్రౌజింగ్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా అమాయక ప్రజలను ఆకర్షించి మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ట్రేడింగ్ పేరుతో ఓ బాధితుడి నుంచి రూ.93 లక్షలు కాజేశారని సీవీ ఆనంద్ తెలిపారు. మ్యూల్ ఖాతాలను ఉపయోగించి బ్యాంకు అధికారుల సహకారంతో నిందితులు భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. గతేడాది మొత్తం రూ.3,500 కోట్లు సైబర్ క్రైమ్‌ ద్వారా నష్టపోయారని, ఇందులో కేవలం 13 శాతం మాత్రమే రికవరీ చేయగలిగామని తెలిపారు. నిందితులు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు కావడంతో దర్యాప్తు ఆలస్యమవుతోందని పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు.