Medical student suicide: దిల్లీలో వైద్య విద్యార్థి ఆత్మహత్య
సెంట్రల్ దిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో 30 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. మంగళవారం సాయంత్రం అమిత్ కుమార్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెడిసన్ మొదటి సంవత్సరం చదువుతున్న అమిత్ కుమార్ మానసిక రుగ్మతతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే ఆత్మహత్యకు సంబంధించి ఎటువంటి సూసైడ్ నోట్ కనపడలేదని పోలీసు అధికారి తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, ఈ ఘటనపై మరింత విచారణ జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు.