
Meerut murder: భర్త సొమ్ముతో.. ప్రియుడి బెట్టింగ్ .. మేరఠ్ హత్య కేసులో కీలక విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్యకేసు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన ఘోరానికి ముస్కాన్ రస్తోగి ఒడిగట్టింది.
ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టి పలు కీలక విషయాలను వెలుగులోకి తెస్తున్నారు.
వివరాలు
భర్త సంపాదన ప్రియుడికి - బెట్టింగ్ మోజులో విహారయాత్రలు
సౌరభ్ విదేశాల్లో ఉండగా, తన భార్య ముస్కాన్ అవసరాల నిమిత్తం ప్రతినెలా లక్ష రూపాయలు పంపించేవాడు.
అయితే, ఈ డబ్బులు భర్త కోసం కాకుండా, ముస్కాన్ తన ప్రియుడు సాహిల్‌కు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది.
సాహిల్ ఆ సొమ్ముతో క్రికెట్ బెట్టింగ్‌లు ఆడేవాడు. గెలిచిన డబ్బుతో ముస్కాన్‌తో కలిసి రిషికేశ్, దెహ్రాదూన్ తదితర ప్రాంతాలకు ట్రిప్‌లకు వెళ్లేవాడు.
సాహిల్‌కు ఉద్యోగం లేకపోయినా, గ్యాంబ్లింగ్ ద్వారా సంపాదించిన పైసలతోనే లైఫ్ ఎంజాయ్ చేసేవాడని పోలీసులు తెలిపారు.
వివరాలు
హత్యకు ముస్కాన్ పక్కాగా ప్లాన్
సౌరభ్‌ను హత్య చేసేందుకు ముస్కాన్ ముందుగానే ప్రణాళిక రూపొందించింది. మొదట అతనికి నిద్రమాత్రలు ఇవ్వాలని భావించి, మందుల చీటీని ఫోర్జరీ చేసింది.
ఫిబ్రవరి 22న ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లి తాను ఆందోళన సమస్యతో బాధపడుతున్నానని చెప్పి మందులు రాయించుకుంది.
ఆ తర్వాత ఖాళీ ప్రిస్క్రిప్షన్ పేపర్‌ను సంపాదించి, దానిలో నిద్రమాత్రల వివరాలను చేర్చింది.
ఫిబ్రవరి 25న సౌరభ్‌ను హత్య చేయాలని ప్రణాళిక వేసింది. అయితే, ఆ రోజున అతను మద్యం సేవించకపోవడంతో ముస్కాన్ ప్రయత్నం విఫలమైంది.
అనంతరం, మార్చి 4న మరోసారి ప్లాన్ చేసి, సౌరభ్‌కు నిద్రమాత్రలు ఇచ్చి, ప్రియుడు సాహిల్‌తో కలిసి అతడిని అత్యంత దారుణంగా హత్య చేసింది.
వివరాలు
ప్రేమించి పెళ్లాడి.. తర్వాత ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన ముస్కాన్
2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌరభ్(29), ముస్కాన్(27) దంపతులకు 2019లో కుమార్తె జన్మించింది.
అయితే, కొంతకాలానికే ముస్కాన్ సాహిల్(25)తో వివాహేతర సంబంధం కొనసాగించింది.
సౌరభ్ మర్చంట్ నేవీలో ఉద్యోగం వదిలేసి లండన్‌లో ఓ బేకరీలో పనిచేస్తుండేవాడు.
అయితే, కుమార్తె పుట్టినరోజు కోసం గత నెల భారతదేశానికి వచ్చాడు. ఇదే అతని చివరి ప్రయాణంగా మారింది.
ముస్కాన్ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికారు.
అనంతరం, ఆ శరీర భాగాలను ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిపెట్టి, దానిపై సిమెంట్ పోసి కప్పేశారు.
ఈ ఘోరం వెలుగు చూసిన తర్వాత, పోలీసులు ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లా లను అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేశారు.