
AP DSC Notificication: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు మళ్లీ శుభవార్తను అందించారు.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ గురించి కీలక ప్రకటన చేశారు.
వచ్చే ఏప్రిల్ నెల తొలి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
వేసవి సెలవులు ముగిసిన వెంటనే, స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యే సమయానికి టీచర్ల నియామక ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు.
మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టీచర్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు తాజా అప్‌డేట్ ఇచ్చారు.
వివరాలు
టీడీపీ హయాంలోనే భారీ ఉద్యోగ నియామకాలు
"టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ 80 శాతం పూర్తయింది. మేము పూర్తిగా పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలను చేపడతాం. మెగా డీఎస్సీని క్రమబద్ధంగా నిర్వహించి, జూన్ నాటికి టీచర్లకు పోస్టింగ్‌లను అందజేస్తాం. ఇప్పటి వరకు 1.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ప్రజలు మన ప్రభుత్వ సేవలను గుర్తుంచుకుంటున్నారు. టీచర్లకు తగిన విధంగా శిక్షణ అందించి, జూన్ నాటికి పోస్టింగ్‌లు ఖరారు చేయాలని" సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ల సమావేశంలో పేర్కొన్నారు.
వివరాలు
అసెంబ్లీలో నారా లోకేష్ ప్రకటన
రాష్ట్రంలో త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసి,పెద్ద సంఖ్యలో టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన ఆయన,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
వైసీపీ సభ్యులైన తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రేగం మత్స్యలింగం, బి. విరూపాక్షి అడిగిన ప్రశ్నకు శాసనసభలో ఆయన సమాధానం ఇచ్చారు.
వివరాలు
2014, 2018, 2019లో మొత్తం 3 డీఎస్సీలు
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని లోకేష్ విమర్శించారు.
గత 30 ఏళ్లలో టీడీపీ హయాంలో, ముఖ్యంగా చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 13 డీఎస్సీలు నిర్వహించి, 1,80,272 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని వివరించారు.
2014-19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 2014, 2018, 2019లో మొత్తం 3 డీఎస్సీలు నిర్వహించి 16,701 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని లోకేష్ స్పష్టంగా తెలిపారు.