
అఫ్ఘానిస్థాన్, పాలస్తీనా కంటే అధ్వానంగా కశ్మీర్: ముఫ్తీ
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో ఇళ్లను కూల్చడాన్ని నిరసిస్తూ పీడీపీ అగ్రనేత మెహబూబా ముఫ్తీ దిల్లీలో ఆందోళన చేప్టటారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ, లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనపై ఆమె విరుచుపడ్డారు. పేదలు, అట్టడుగువర్గాల ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు జమ్ముకశ్మీర్‌ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
అఫ్ఘానిస్తాన్, పాలస్తీనా కంటే కశ్మీర్ అధ్వానంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేసేందుకు బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారన్నారు. పేదల ఇళ్లను కూల్చడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.
దిల్లీ
మెహబూబా ముఫ్తీని అరెస్టు చేసిన దిల్లీ పోలీసులు
ఆక్రమణల తొలగింపులో భాగంగా పేదల ఇళ్లను తాకబోమని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పినా, అలా జరగడం లేదన్నారు. టిన్ షెడ్‌లతో కూడిన నివాసాలు కూడా తొలగిస్తున్నట్లు చెప్పారు.
జమ్ముకశ్మీర్‌లో సాధారణ ప్రజలపై జరుగుతున్న దురాగతాల పట్ల ప్రతిపక్షాలు స్పందించాలని కోరారు. కాంగ్రెస్, లెఫ్ట్, డిఎంకె, టీఎంసీ, సమాజ్‌వాది పార్టీ, ఇతర ప్రతిపత్రక్ష పార్టీలు తమ గళాన్ని వినిపించాలని కోరారు.
ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న మెహబూబా ముఫ్తీని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.