'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్
జమ్ముకశ్మీర్‌లో పండిట్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. వారి మమస్యలకు పరిషారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కశ్మీరీ పండింట్లను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బిచ్చగాళ్లు అని సంబోధించడం బాధ్యతారాహిత్యమన్నారు. ఈ విషయం మీకు తెలియకపోవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. కశ్మీరీ పండిట్ ప్రభుత్వ అధికారులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్న నేపథ్యంలో వారికి తగిన భద్రత లేకుండా లోయకు తిరిగి రావాలని ఒత్తిడి చేయవద్దని లేఖలో రాహుల్ పేర్కొన్నారు. తన 'భారత్ జోడో యాత్ర'లో భాగంగా ఒక ప్రతినిధి బృందాన్ని తాను కలిసినట్లు చెప్పారు. వారు పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చినట్లు వివరించారు.
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెంటనే క్షమాపణలు చెప్పాలి: రాహుల్
ప్రభుత్వ అధికారులు తమను కశ్మీర్‌కు తిరిగి రమ్మని బలవంతం చేస్తున్నారని కశ్మీరీ పండిట్ ఉద్యోగులు తనతో చెప్పిటన్లు లేఖలో పేర్కొన్నారు. భద్రతకు హామీ లేకుండా, వారిని కశ్మీర్‌లో తమ పనికి తిరిగి వెళ్లమని బలవంతం చేయడం క్రూరమైన చర్యగా అభివర్ణించారు. కశ్మీరీ పండిట్ ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేయాలని కోరారు. కశ్మీరీ పండిట్లపై అనుచిన వ్యాఖ్యలు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెంటనే క్షమాపణలు చెప్పాలని లేఖలో రాహుల్ డిమాండ్ చేశారు.