NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Rains: ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం..
    తదుపరి వార్తా కథనం
    AP Rains: ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం..
    ఏపీకి మరోసారి తుపాను ముప్పు

    AP Rains: ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 11, 2024
    08:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రానికి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.

    ఆ తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది.

    ఇది ఈనెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా మారుతుందని కొన్ని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి.

    ఇది తీవ్ర వాయుగుండంగా మారి, ఈనెల 17 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ భావిస్తోంది.

    ఇది తుపానుగా బలపడి ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో ఈనెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చని అమెరికా వాతావరణ నమూనా అంచనా వేస్తోంది.

    అల్పపీడనం ఏర్పడ్డాక దీనిపై స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

    వివరాలు 

    ఈనెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు

    ఈ ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈనెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.

    అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. కర్ణాటక, గోవా తీరాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది.

    ఇది వాయవ్య దిశగా కదులుతూ రెండు లేదా మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

    ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారీ వర్షాలు
    ఆంధ్రప్రదేశ్
    ఐఎండీ

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    భారీ వర్షాలు

    Ap Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తుపానుగా మారితే వానలే వానలు బంగాళాఖాతం
    Chennai : చెన్నైలో కొనసాగుతున్న భీకర వర్షాలు.. తుఫానును ఎదుర్కోనేందుకు సీఎం అత్యవసర భేటీ   చెన్నై
    Michaung' Cyclone: మిచౌంగ్‌ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు  తుపాను
    Tamilnadu Heavy rains: తమిళనాడులో భారీ వర్షాలు.. 4 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత  తమిళనాడు

    ఆంధ్రప్రదేశ్

    AP News: మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు.. 'జలజీవన్‌ మిషన్‌'పై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం చంద్రబాబు నాయుడు
    Murder: ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య.. కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు హత్య
    Praksam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి ప్రకాశం జిల్లా
    Sonusood: చంద్రబాబు పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు : సోనుసూద్  చంద్రబాబు నాయుడు

    ఐఎండీ

    రాగల 24 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరిక తెలంగాణ
    దిల్లీల్లో మరికొన్ని రోజులు వర్షాలు; మళ్లీ ప్రమాద స్థాయికి యమునా నది దిల్లీ
    రాగల 5 రోజుల్లో దేశవ్యాప్తంగా మరో కుంభవృష్టి.. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు భారీ వర్షాలు
    మరోసారి హైదరాబాద్‌ మహానగరంలో దంచికొట్టిన వర్షం.. రేపు ఉదయం వరకు ఉరుములతో కూడిన మోస్తరు వాన తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025