
AP: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాలకు పిడుగుల ముప్పు!
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే మూడురోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు 40° సెంటీగ్రేడ్ లోపే ఉండనున్నట్లు ఆయన తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Details
జిల్లాల వారీగా వర్ష సూచన
గురువారం: అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.
శుక్రవారం : రాయలసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే సూచనలు.
పిడుగుల ముప్పు ఉన్న ప్రాంతాలు
శ్రీకాకుళం జిల్లా - 6 మండలాలు
విజయనగరం జిల్లా - 5 మండలాలు
పార్వతీపురం మన్యం జిల్లా - 7 మండలాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా-3 మండలాలు
తూర్పుగోదావరి జిల్లా - 2 మండలాలు
మొత్తంగా 23 మండలాల్లో పిడుగుల ముప్పు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.