
Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఛార్జీల భారం తప్పలేదు.
ఇటీవల టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన మెట్రో రైల్ సంస్థ, కొత్త ఛార్జీలను మే 17 నుంచి అమలులోకి తీసుకొచ్చింది.
ఈ మేరకు నేటి నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. మెట్రో సంస్థ ప్రకారం, కనీస టికెట్ ధరను రూ.10 నుండి రూ.12కి, గరిష్ట టికెట్ ధరను రూ.60 నుండి రూ.75కి పెంచినట్లు తెలిపింది.
2017లో హైదరాబాద్ మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి.
అప్పటి నుంచి నిత్యం వేలాది మంది ఈ సేవలను వినియోగిస్తున్నారు.
ప్రజల నుండి మంచి స్పందన వచ్చినా, ఇప్పటివరకు ఛార్జీలను పెంచలేదు. అయితే తొలిసారి టికెట్ ధరల పెంపు అనివార్యమైంది.
Details
కొత్త టికెట్ ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి
ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల మేరకు ఛార్జీలను సవరించినట్లు మెట్రోను నిర్వహిస్తున్న L\&T సంస్థ వెల్లడించింది. ఈ పెంపుతో టికెట్ ధరలు సగటున 20 శాతం మేర పెరిగినట్లు పేర్కొనవచ్చు.
2 స్టాప్‌లు వరకు రూ.12 (కనీస ఛార్జీ)
2 నుంచి 4 స్టాప్‌లు : రూ.18
4 నుంచి 6 స్టాప్‌లు : రూ.30
6 నుంచి 9 స్టాప్‌లు : రూ.40
9 నుంచి 12 స్టాప్‌లు : రూ.50
12 నుంచి 15 స్టాప్‌లు : రూ.55
15 నుంచి 18 స్టాప్‌లు : రూ.60
18 నుంచి 21 స్టాప్‌లు : రూ.66
24 స్టాప్‌లు లేదా అంతకంటే ఎక్కువ : గరిష్టంగా రూ.75