Page Loader
MiG-21: భారత వైమానిక దళంలో కీలక పాత్ర పోషించిన మిగ్-21 విమానాల తొల‌గింపు 
భారత వైమానిక దళంలో కీలక పాత్ర పోషించిన మిగ్-21 విమానాల తొల‌గింపు

MiG-21: భారత వైమానిక దళంలో కీలక పాత్ర పోషించిన మిగ్-21 విమానాల తొల‌గింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

భార‌తీయ వైమానిక ద‌ళం నుంచి మిగ్-21 యుద్ధ విమానాలను పూర్తిగా తీసివేసే పనిని ద‌శ‌ల వారీగా ప్రారంభించ‌నున్నారు. ఈ తొల‌గింపు ప్ర‌క్రియ సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. ర‌ష్యాలో త‌యారీ చేసిన మిగ్‌-21 యుద్ధ విమానాల స్క్వాడ్రన్‌లు రిటైర్ కానున్నాయి. గత అనేక ద‌శాబ్దాలుగా మిగ్‌-21 యుద్ధ విమానాలు భారత వైమానిక ద‌ళంలో కీల‌క పాత్ర పోషించాయి. పలు యుద్ధాల్లో ఈ యుద్ధ విమానాలు త‌మ సామ‌ర్థ్యాన్ని చాటాయి.ఇప్ప‌టివ‌ర‌కు మిగ్‌-21 యుద్ధ విమానాల‌తో ఉన్న స్థానాన్ని.. భారతీయ వైమానిక దళం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమానాలు భ‌ర్తీ చేసే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

 భారత వైమానిక ద‌ళానికి 36 మిగ్‌-21 యుద్ధ విమానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి

ప్ర‌స్తుతం భారత వైమానిక ద‌ళానికి 36 మిగ్‌-21 యుద్ధ విమానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 1963లో మిగ్ విమానాలను తొలిసారి భారత వైమానిక ద‌ళం వాడటం ప్రారంభించింది. 2023లో చివరి సారి మిగ్-21 యుద్ధ విమానం రాజ‌స్థాన్‌లోని బార్మ‌ర్ వాయుసేన స్థావరం నుంచి గాల్లోకి లేచింది. 2025 చివ‌రి నాటికి మిగ్-21 విమానాల‌ను పూర్తిగా తీసివేసి.. వాటి స్థానంలో లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) మార్క్-1ఏ యుద్ధ విమానాలను వినియోగించనున్న‌ట్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వీఆర్ చౌద‌రీ స్ప‌ష్టం చేశారు.