సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం
సూడాన్‌లో సాయుధ పోరాటం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా రాయబారులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కొన్ని రోజులుగా కొనసాగుతున్న అంతర్యుద్ధంతో సూడాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సూడాన్‌లో గత ఏడు రోజులుగా దేశ సైన్యం, పారామిలటరీ గ్రూపు మధ్య జరిగిన ఘోరమైన పోరులో జరుగుతోంది. ఈ పోరాటంలో 200మందికి పైగా మరణించినట్లు సమాచారం. సూడాన్‌లో జరుగుతున్న సాయుధ పోరాటంలో దాదాపు 4,000మంది చిక్కుకున్నారు. విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల కారణంగా భారతీయులు ఆహారం, నీరు, మందులు, విద్యుత్ కొరతను కూడా ఎదుర్కొంటున్నారు. దాదాపు ఐదు మిలియన్ల మంది ప్రజలు విద్యుత్, ఆహారం లేదా నీరు లేకుండా అల్లాడిపోతున్నారు. కమ్యూనికేషన్ వ్వవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఆపన్న హస్తం కోసం ఎదురు భారతీయల ఎదురుచూపు
సూడాన్ రాజధాని నగరం ఖార్టూమ్‌లో వేలాది మంది భారతీయుల ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను భారతీయులను ఆదుకునేందుకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్, సెక్రటరీ సీపీవీ ఔసఫ్ సయీద్, భారతీయులను తరలించడంలో ముఖ్యమైన పాత్ర పోషించగల ప్రాంతం గల్ఫ్ దేశాలు రాయబారులు హాజరయ్యారు. రంజాన్ వేడుకల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 72 గంటల పాటు పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ క్రమంలో భారతీయులను దేశానికి రప్పించేందుకు ఈ సమయాన్ని అధికారులు ఉపయోగించుకునే అవకాశం ఉందని సమాచారం