LOADING...
Andhra: విజయవాడ బస్‌ స్టేషన్‌లో ఎట్టకేలకు  తెరుచుకోనున్న మినీ థియేటర్లు  
విజయవాడ బస్‌ స్టేషన్‌లో ఎట్టకేలకు తెరుచుకోనున్న మినీ థియేటర్లు

Andhra: విజయవాడ బస్‌ స్టేషన్‌లో ఎట్టకేలకు  తెరుచుకోనున్న మినీ థియేటర్లు  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2025
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌లో 2015లో దేశంలో తొలిసారిగా ప్రయాణ ప్రాంగణంలో ప్రయాణికుల వినోదానికి "వై స్క్రీన్స్‌" పేరుతో మినీ థియేటర్‌లను ఏర్పాటు చేశారు. ఆ థియేటర్లు ప్రయాణికులకు విశ్రాంతి సమయాన్ని సరదాగా గడపటానికి ప్రత్యేక వేదికగా మారాయి. కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత నిర్వాహకులు అద్దె చెల్లించడంలో విఫలమవడంతో 2020లో ఆర్టీసీ అధికారులు ఆ మినీ థియేటర్లను సీజ్‌ చేశారు. అప్పటి నుంచి మినీ థియేటర్‌లు తెరుచుకోలేదు. మధ్యలో టెండర్లు పిలిచినా స్పందన రాలేదు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత, ఆర్టీసీ అధికారులు మళ్లీ టెండర్లు ప్రక్రియను ప్రారంభించారు.

వివరాలు 

థియేటర్ చుట్టుపక్కల దుకాణాలకు అనుమతులు లేవు 

ఫలితంగా, మినీ థియేటర్లు తిరిగి ప్రారంభం కాని దిశలో కదలిక మొదలయింది. ప్రస్తుత గుత్తేదారుకు నెలకు రూ.2.50 లక్షల అద్దె ప్రాతిపదికన లీజుకు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. గతంలో, థియేటర్ యాజమాన్యానికి చుట్టుపక్కల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్టీసీ అధికారుల నుండి అనుమతులు లభించాయి. అయితే ప్రస్తుత పరిస్థితిలో, ఆర్టీసీ అధికారులు థియేటర్ చుట్టుపక్కల ఎటువంటి దుకాణాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం ఇవ్వలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు.