Page Loader
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక అంశాలపై చర్చ.. వాటికి లైన్‌ క్లియర్‌
ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక అంశాలపై చర్చ.. వాటికి లైన్‌ క్లియర్‌

AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక అంశాలపై చర్చ.. వాటికి లైన్‌ క్లియర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2024
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి, కేబినెట్ నిర్ణయాలను వివరించారు. గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల గురించి ఆయన మాట్లాడారు.జల్ జీవన్ మిషన్ పథకం కేవలం కొన్ని భాగాల పరిమితిలో మాత్రమే అమలయిందని,లక్ష నుంచి లక్షన్నర విలువైన ప్రతిపాదనలు పంపించబడ్డాయని,కేరళ వంటి చిన్న రాష్ట్రాలు కూడా ఈ పథకంలో భాగస్వామ్యమయ్యాయని తెలిపారు. అయితే, శుద్ధి చేసిన నీటి సరఫరాకు లక్షలాది ప్రజలు దూరమయ్యారని ఆయన చెప్పారు. అలాగే, 25 శాతం కంటే తక్కువ ప్రగతి ఉన్న 11,400కోట్లు విలువైన పనులు రీటెండరింగ్ కు వెళ్ళిపోతాయని, వాటికి కేబినెట్ ఆమోదం ఇచ్చిందన్నారు.

వివరాలు 

అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు 

డోన్, ఉత్థానం, పులివెందులలో పనులు ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ ప్రధాన ఉద్దేశం, స్థిరమైన నీటి వనరులు వినియోగించి ప్రజలకు త్రాగునీటి వసతి అందించడం అని ఆయన చెప్పారు. ఇంకా, అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు అందినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. 45 ఇంజనీరింగ్ పనులకు 33,137 కోట్లతో కేబినెట్ ఆమోదం ఇచ్చింది. గ్రామకంఠ భూముల సర్వే, రికార్డింగ్ పనులకు 48,899 సబ్ డివిజన్ల కోసం దరఖాస్తులు వచ్చాయని, వాటికి ఫీజు రాయితీతో కేబినెట్ ఆమోదం ఇచ్చిందన్నారు. వరదలతో ముంపుకు గురైనవారి రుణాలపై యూజర్ ఛార్జీలు ఎత్తివేసేందుకు, రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.

వివరాలు 

1.06 లక్షల ఉపాధి అవకాశాలు

మార్క్ ఫెడ్ కు 1000 కోట్ల అదనపు రుణం మంజూరయ్యిందని, పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులకు రీటెండరింగ్ కు కూడా ఆమోదం లభించిందన్నారు. హంద్రీనీవా కింద పుంగనూరు బ్రాంచి కెనాల్ పనులు పాత రేట్ల ప్రకారం చేయాలని కేబినెట్ ఆమోదించింది. రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో NTPC జాయింట్ వెంచర్ కు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా 1.06 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయని తెలిపారు.

వివరాలు 

ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం 

మరోవైపు, ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పార్థసారథి ప్రకటించారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు,కేజీబీవీల్లో ఈ పథకం అమలు కోసం కేబినెట్ ఆమోదం ఇచ్చింది. ఈ పథకాన్ని పునరుద్ధరించడం ద్వారా 1.4 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కు పుస్తకాలను సరఫరా చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం ఇచ్చింది. ప్రభుత్వ కాలేజీలలో జేఈఈ వంటి పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయడానికి కేబినెట్ అనుమతిచ్చింది.