
కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా? కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ కావాలా?: కేటీఆర్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
తాజాగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా, కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ కావాలో తెల్చుకోవాలని తెలంగాణ రైతన్నలకు సూచించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ శనివారం బీఆర్‌ఎస్ శ్రేణులతో టెలీకాన్షరెన్స్ నిర్వహించారు.
రైతులకు కేవలం 3 గంటల విద్యుత్ చాలంటున్న కాంగ్రెస్ తీరుపై ప్రతీపల్లెలో చర్చ జరగాలన్నారు.
ప్రజల్లోకి ఇదే అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ క్యాడర్‌కు సూచించారు.
ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు రైతు సమావేశాలు జరుగుతాయని, ప్రతీ రైతు వేదిక వద్ద అన్నదాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్
కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దే
— BRS Party (@BRSparty) July 15, 2023
- భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS
రైతన్నలకు మూడు గంటల విద్యుత్ చాలన్న కాంగ్రెస్ విధానం పైన ప్రతి గ్రామంలో చర్చ జరగాలి... ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్… pic.twitter.com/ttoaUROUZC