ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు.. వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో భాజపా, బీఆర్ఎస్ మధ్య మరోసారి అగ్గి రాజుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పుట్టుకను అవమానించారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వరంగల్ వస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తల్లిని చంపి బిడ్డను బయటకు తీసినట్లు, ఏపీ నుంచి తెలంగాణను వేరు చేశారని గతంలో అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు.
విభజన హామీల్లో మోదీ ఏదీ నెరవేర్చలేదన్నారు. గుజరాత్ కు మాత్రం రూ.20 వేల కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారని, తెలంగాణకు కేవలం రూ. 521 కోట్ల నిధులు ఇవ్వడమేంటన్నారు.
ఈ మేరకు ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని, రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు. రేపు వరంగల్లో జరగనున్న ప్రధాని పర్యటనను బీఆర్ఎస్ బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు వెల్లడి చేసిన కేటీఆర్
తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోదీ... విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చని ప్రధాని ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారు.
— BRS Party (@BRSparty) July 7, 2023
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS. pic.twitter.com/GZt6JmCfQC