LOADING...
Nara Lokesh: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పనులు తక్షణమే ప్రారంభించాలి: మంత్రి లోకేష్ 
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పనులు తక్షణమే ప్రారంభించాలి: మంత్రి లోకేష్

Nara Lokesh: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పనులు తక్షణమే ప్రారంభించాలి: మంత్రి లోకేష్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలోని ప్రతిపాదిత డేటా సెంటర్‌ క్యాంపస్‌లో చిప్‌ డిజైనింగ్‌ కేంద్రాన్నిఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా రాష్ట్ర విద్య,ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రెన్స్‌కు సూచించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్‌తో ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో, తాజా ఈ ప్రతిపాదనపై గూగుల్ ఉన్నతాధికారుల బృందంతో సమీక్షించి,త్వరలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని బ్రెన్స్ స్పష్టం చేశారు. గూగుల్ డేటా సెంటర్‌ పనులు ఎంత తొందరగా ప్రారంభమవుతాయో అంత మంచిదని పేర్కొంటూ, విశాఖలో డేటా సిటీకి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నందున వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

బలమైన ఎయిర్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ

చైనా,తైవాన్ వంటి దేశాలకు దూరంగా,భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని స్థాపించి, గూగుల్ సర్వర్ సప్లై చైన్‌ను ఇక్కడి ద్వారా అనుసంధానించాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంతేకాదు, గూగుల్ క్లౌడ్, సర్వర్ సరఫరాదారులు,వీటి మరమ్మతులు, నిర్వహణ సేవల కోసం ఆంధ్రప్రదేశ్‌ను ఒక గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచించారు. రాష్ట్రానికి ఉన్న బలమైన వైమానిక, నౌకాశ్రయ అనుసంధానాలతో గూగుల్‌కు కావాల్సిన అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రుల బృందం ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో భాగంగా మూడో రోజు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విశాఖలో గూగుల్ డేటా సెంటర్