Page Loader
Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2025
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు తప్పకుండా అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఇందిరమ్మ రాజ్యం 15 నెలలు పూర్తిచేసుకుందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కొన్ని ఇప్పటికే అమలు చేశామని, మిగిలినవాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసే కార్యక్రమం వచ్చే వారంలో ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం వల్ల తులం బంగారం పంపిణీ కొంత ఆలస్యమవుతున్నట్లు తెలిపారు.

వివరాలు 

ప్రతి హామీని తప్పక అమలు చేస్తాం :  పొంగులేటి 

గత కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అక్రమాలు, అవినీతి జరిపిందని విమర్శిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం అన్ని రంగాలను గాడిలో పెడుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని ఎక్కడా తగ్గించకుండా అనేక చర్యలు తీసుకున్నామని, ఇందిరమ్మ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఆలస్యమైనా తప్పక అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.