
Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు.. పొదిలి, దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాల్లో..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భూమి కంపించడం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది.
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి.
ముఖ్యంగా పొదిలి, దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాల్లో కొన్ని క్షణాల పాటు భూమి కంపించినట్లు నివేదికలు వచ్చాయి.
భూప్రకంపనలు సంభవించే సమయంలో పెద్ద శబ్దాలు వినిపించాయని స్థానికులు పేర్కొంటున్నారు.
ఆకస్మాత్తుగా శబ్దాలతో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇక, సోమవారం రోజున తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కూడా స్వల్ప భూప్రకంపనలు నమోదు కావడం తెలిసిందే.
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.
వివరాలు
వరుస భూప్రకంపనలు.. ప్రజల్లో టెన్షన్
కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో పాటు ఇళ్లలోని వస్తువులు కదిలినట్టు స్థానికులు వెల్లడించారు.
ఈ పరిణామంతో అసహజమైన పరిస్థితుల మధ్య ప్రజలు భయంతో తాము ఉన్న గృహాల నుంచి వెలుపలికి పరుగులు పెట్టారు.
కరీంనగర్ జిల్లా మొత్తం మీద భూప్రకంపనల ప్రభావం ఎక్కువగానే కనిపించిందని తెలుస్తోంది.
అక్కడి చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో భూమి కొద్ది క్షణాలు కంపించినట్టు నివేదికలు చెబుతున్నాయి.
ఇక ప్రకాశం జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ వరుస భూప్రకంపనలు ప్రజల్లో టెన్షన్‌కు కారణమవుతున్నాయి.