
MK Stalin: గవర్నర్‌తో విభేదాల వేళ.. స్వయంప్రతిపత్తి కోసం ప్యానెల్ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.
గవర్నర్ ఆర్.ఎన్.రవితో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో, రాష్ట్ర స్వయంప్రతిపత్తి (ఆటానమీ) అంశంపై చర్చించి, తగిన సూచనలు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ, రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని సాధించేందుకు అవసరమైన చర్యలపై సిఫారసులు చేయనుంది.
ఇటీవలి కాలంలో గవర్నర్, తమిళనాడు ప్రభుత్వ మధ్య బిల్లుల ఆమోద ప్రక్రియపై తీవ్ర అభిప్రాయ భేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
వివరాలు
బిల్లులకు చట్టబద్ధ హోదా
అయితే, ఇటీవల సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం ద్వారా స్టాలిన్ ప్రభుత్వం కొంత ఊరట పొందింది.
గవర్నర్ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంచిన పది బిల్లులు, ఆయన ఆమోదించినట్టుగా పరిగణించవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, ఆ బిల్లులకు చట్టబద్ధ హోదా కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ పరిణామాల నడుమే తాజా కమిటీ ఏర్పాటైనట్లు తెలుస్తోంది.