AP MLC: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఏపీ ఎన్నికల సంఘం ఈ ప్రకటనను విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పట్టభద్రుల నియోజకవర్గం, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, అలాగే ఉమ్మడి శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
వివరాలు
ఎన్నికల షెడ్యూల్:
ఫిబ్రవరి 3 - 10: నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 11: నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 13: నామినేషన్లు ఉపసంహరణకు చివరి తేదీ
ఫిబ్రవరి 27: ఎన్నికల పోలింగ్
మార్చి 3: ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ప్రధాన రాజకీయ పార్టీలు తమ దృష్టిని ఎన్నికలపై కేంద్రీకరించాయి.
ఇప్పటికే పలు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.