MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నారు. దీంతో ఆమె విచారణ వాయిదా పడింది. ఏప్రిల్ 22 లేదా 23న కోర్టు వాదనలు విననుంది.మద్యం కేసులో తాను నిర్దోషినని, తనపై అక్రమంగా కేసు పెట్టారని, కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ కేసు విచారణ జరగాల్సి ఉండగా, న్యాయమూర్తి సెలవులో ఉన్నందున వాయిదా పడింది. తనను సీబీఐ అరెస్ట్ చేసిన కేసులో కవిత సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 22న విచారణ జరగనుంది.