
Kerala: కేరళలో అరుణాచల్ ప్రదేశ్ వలస కార్మికుడు దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో దారుణం చోటుచేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌నుంచి వలస వచ్చిన ఓ కార్మికుడిని కేరళలోని ఎర్నాకుళంలో దారుణంగా హత్య చేశారు.
ఈ ఘటనలో పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన అశోక్ దాస్ చాలాకాలం క్రితం కేరళలోని ఎర్నాకుళంకు వచ్చి ఓ హోటల్ రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు.
ఈక్రమంలో ఓ మహిళ స్నేహితురాలిని కలిసేందుకు మువ్వట్టుపళ కు వచ్చాడు.
కలిసిన అనంతరం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అశోక్ దాస్‌ను పట్టుకుని కట్టేసి తీవ్రంగా కొట్టారు.
Details
పదిమంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఆ దెబ్బలకు తాళలేక అశోక్ దాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అశోక్ దాస్ ను ఎందుకు కట్టేసి కొట్టారు..చంపవలసిన అవసరమేముందన్నది కారణం తెలియరాలేదు.
ఈ ఘటనతో సంబంధం ఉన్న పదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
వారిపై కేసు నమోదు చేసి ఈ ఘటనలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో తెలుసుకునేందకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అశోక్ దాస్ మృతదేహాన్ని అరుణాచల్ ప్రదేశ్ లోని అతడి బంధువులకు అప్పగించారు.