NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MOD: ఆర్మీ చీఫ్‌కు కేంద్రం ప్రత్యేక అధికారాలు 
    తదుపరి వార్తా కథనం
    MOD: ఆర్మీ చీఫ్‌కు కేంద్రం ప్రత్యేక అధికారాలు 
    ఆర్మీ చీఫ్‌కు కేంద్రం ప్రత్యేక అధికారాలు

    MOD: ఆర్మీ చీఫ్‌కు కేంద్రం ప్రత్యేక అధికారాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2025
    01:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో భారత రక్షణ శాఖ కీలకంగా అడుగులు వేస్తోంది.

    దేశంలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

    ఈ నేపథ్యంలో,రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS), త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఇవాళ నిర్వహించారు.

    ఈ భేటీలో దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమగ్రంగా చర్చించడంతో పాటు, భద్రతను మరింత పటిష్ఠంగా చేయాలన్న ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

    ఈ సమీక్ష సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న32 టెరిటోరియల్ ఆర్మీ బటాలియన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

    ఇందులో భాగంగా,14టెరిటోరియల్ ఆర్మీ బటాలియన్లను వెంటనే విధుల్లోకి దింపాలని నిర్ణయించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఆర్మీ చీఫ్‌కు ప్రత్యేక అధికారాలు 

    BREAKING 🚨

    MoD activated 14 Infantry Battalions of the Territorial Army for deployment across Northern, Western and Eastern Commands till 2028. For heightened readiness and strategic reinforcement. (⚠️Public gazette notification, not classified) pic.twitter.com/FpOwNcNRhO

    — Shiv Aroor (@ShivAroor) May 9, 2025

    వివరాలు 

    అత్యవసర సేవల కోసం సిద్దం 

    పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వీరిని అత్యవసరంగా సేవల కోసం సిద్దం చేయనున్నారు.

    టెరిటోరియల్ ఆర్మీ (TA) అంటే, ఇది భారత సైన్యానికి అవసరమైన సేవలు అందించే పార్ట్ టైమ్ వాలంటీర్లతో కూడిన రిజర్వ్ దళం.

    ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది సభ్యులుగా ఉంటారు.

    వీరందరూ భారత సైన్యంలో ఉన్న సర్వీసు సభ్యులతో సమానమైన ర్యాంక్‌లు కలిగి ఉండటం విశేషం.

    అయితే, వీరు సైనిక సేవలతో పాటు తమ పౌర జీవితాల్లో తమ వృత్తులను కొనసాగించే అవకాశాన్ని కూడా కలిగి ఉంటారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రక్షణ శాఖ మంత్రి

    తాజా

    SkyStriker: ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన 'స్కై స్ట్రైకర్స్ .. దీని విశిష్టత ఏంటంటే..? ఆపరేషన్‌ సిందూర్‌
    NTRNeel : 'డ్రాగన్' సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది జూనియర్ ఎన్టీఆర్
    #NewsBytesExplainer: దేశ రక్షణలో దూసుకెళ్తుతోంది.. భారత ఆర్మీలో 'ఆకాష్ క్షిపణి' కీలక పాత్ర ఆర్మీ
    Share Market: భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌ మార్కెట్లు  స్టాక్ మార్కెట్

    రక్షణ శాఖ మంత్రి

    అమెరికా అణు ప్రయోగ కేంద్రంపై చైనా 'గూఢచారి' బెలూన్‌, పెంటగాన్ అలర్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    మరో చైనా 'గూఢచారి' బెలూన్‌ను గుర్తించిన అమెరికా, డ్రాగన్ వ్యూహం ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025