Modi 3.0 Cabinet first meet: ఈరోజు మోడీ 3.0 కేబినెట్ మొదటి సమావేశం.. 100 రోజుల కార్యక్రమంపై కార్యాచరణ
కొత్తగా ఏర్పాటైన మోడీ 3.0 క్యాబినెట్ తన మొదటి సమావేశాన్ని ప్రధాని నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటలకు జరగనున్న సమావేశంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీన్ (PMAY-G) కింద రెండు కోట్ల అదనపు ఇళ్లను ఆమోదించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంకా, కేంద్ర మంత్రివర్గం PMAY-G కింద లబ్ధిదారులకు అందించే సహాయాన్ని దాదాపు 50 శాతం పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఉభయ సభల్లో త్వరలో ద్రౌపది ముర్ము ప్రసంగం
త్వరలో పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మంత్రివర్గం అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును కోరనున్నట్లు సమాచారం. రికార్డు స్థాయిలో మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 72 మంది మంత్రులు కూడా రాష్ట్రపతి భవన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
100 రోజుల కార్యక్రమానికి రంగం సిద్ధం
ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు, మోదీ తన నివాసంలో జరిగిన టీ మీటింగ్‌లో తన మూడవ క్యాబినెట్‌లో చేరిన మంత్రులకు '100 రోజుల కార్యక్రమం'తో వెళ్లాలని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన మధ్యంతర బడ్జెట్‌లో పౌరులందరికీ సరసమైన గృహాలను ప్రస్తావించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వచ్చే ఐదేళ్లలో పీఎంఏవై-జీ కింద రెండు కోట్ల అదనపు ఇళ్లు నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవ హామీల అమలుకు కార్యాచరణ
ఇదిలా ఉండగా, మురికివాడలు, , అనధికార కాలనీలు , అద్దె ఇళ్లలో నివసించే పేద, మధ్యతరగతి పౌరులకు రుణ రేట్లలో ఉపశమనం కలిగిస్తామని ప్రధాని మోదీ చెప్పిన సంగతి విదితమే. త్వరలో ఈ దిశగా చర్యలకు అడుగులు పడనునున్నాయి .తన వాగ్దానాల అమలుకు తగిన కార్యాచరణకు మోదీ సర్కార్ యత్నిస్తుంది. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ మేరకు మోదీ ఇచ్చిన హామీని అమలు చేయనున్నారు.