Union Budget: బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రేట్లు తగ్గే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
రాబోయే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను తగ్గించడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
ప్రత్యేకించి మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కల్పించి, నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచేందుకు, రూ. 15 లక్షల వరకు సంపాదిస్తున్న వారిపై ఆదాయపు పన్ను తగ్గింపు చర్యలను సమీక్షిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇది అమల్లోకి వస్తే, లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు దీని ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
ముఖ్యంగా అధిక జీవన వ్యయం ఉన్న నగర నివాసులు,అలాగే కొత్త పన్ను విధానంలో ఇంటి అద్దె మినహాయింపును ఎంచుకునే వారికి ఈ నిర్ణయం అత్యంత ఉపయుక్తంగా మారనుంది.
వివరాలు
మధ్యతరగతి ప్రజల జేబులో ఎక్కువ డబ్బు
అయితే, ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రకటనకు ముందు దీనిపై తుది నిర్ణయం తీసుకోగలమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు రాయిటర్స్ మెయిల్ పంపినప్పటికీ, వారికి బదులు అందలేదని సమాచారం.
పన్ను తగ్గింపు వల్ల ప్రభుత్వ ఆదాయం కొంతమేర తగ్గినా, అధిక సంఖ్యలో ప్రజలు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటారని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఈ చర్య ద్వారా మధ్యతరగతి ప్రజల జేబులో ఎక్కువ డబ్బు నిలుస్తుంది, అది ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తోడ్పడుతుంది.
వివరాలు
అధిక ఆహార ద్రవ్యోల్బణం,నిత్యావసర వస్తువులు, వాహనాల ధరల పెరుగుదల
దేశీయ వృద్ధి నెమ్మదించడం, అధిక ఆహార ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువులు, వాహనాల ధరల పెరుగుదల వంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం సవాళ్లను అధిగమించగలదని ప్రభుత్వం భావిస్తోంది.
అంతేకాకుండా, అధిక పన్నుల వల్ల మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ద్వారా రాజకీయ విమర్శలను ఎదుర్కోవడంలో ఈ నిర్ణయం దోహదపడవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.