మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ పదవికి రాజీనామా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నోరువిప్పాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. పార్టీ అగ్రనేతలు తనను కోరితే తాను రాజీనామా చేస్తానని బ్రిజ్ భూషణ్ చెప్పడంతో ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన నరేంద్ర మోదీ మాట కోసం న్యాయం ఎదురు చూస్తోందని ప్రియాంక ట్వీట్ చేశారు. ఏడుగురు మహిళా రెజ్లర్లు సింగ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు భూషణ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అసలు ఏం చెప్పారంటే?
లైంగిక ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, ఇతరులతో సహా పలువురు అగ్రశ్రేణి భారతీయ రెజ్లర్లు కొన్నిరోజులుగా జంతర్ మంతర్‌లో నిరసనలు చేస్తున్నారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజీనామా చేయడంపై బ్రిజ్ భూషణ్ స్పందించారు. తాను డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ పదవికి పోటీ చేయనని పేర్కొన్నారు. అయితే కొత్త పోస్ట్ కోసం తాను పోటీ చేస్తానని చెప్పారు. తాను ప్రధాని కోరితే వెంటనే రాజీనామా చేస్తానని, అలాగే అమిత్ షా చెప్పినా, జేపీ నడ్డా అడిగినా పదవి నుంచి తప్పుకుంటానని భూషణ్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా తాజా ప్రియాంక మోదీని నోరు విప్పాలని కోరారు.