
PM Modi: సౌదీ గగనంలో మోదీకి ఘన స్వాగతం.. ఎస్కార్ట్‌గా సౌదీ ఫైటర్ జెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు.
రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయలుదేరారు.
మోదీ పర్యటనను పురస్కరించుకుని, సౌదీ ప్రభుత్వం అత్యంత ఘనంగా స్వాగతం తెలిపింది.
ప్రధానమంత్రి ప్రయాణిస్తున్న విమానం సౌదీ గగనతలంలోకి రాగానే, రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్లు ఆయన్ను ఎస్కార్ట్ చేశాయి.
మోదీ విమానానికి ఇరువైపులా మూడు చొప్పున మొత్తం ఆరు జెట్ ఫైటర్లు పరిపూర్ణ భద్రతతో దాన్ని చుట్టుముట్టి గౌరవ వందనం ఇచ్చాయి.
దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సౌదీ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Details
భారత్-సౌదీ మధ్య ఆరు కీలక ఒప్పందాలు
భారత్-సౌదీ సంబంధాలు గతకొన్ని సంవత్సరాల్లో మరింత బలపడినట్టు ఆయన పేర్కొన్నారు. రక్షణ, వాణిజ్య, పెట్టుబడులు, ఎనర్జీ రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెరుగుతోందన్నారు.
అంతేకాదు, ప్రాంతీయ స్థాయిలో శాంతి, సామరస్యం, స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. ఇది మోదీకి సౌదీలో మూడో పర్యటన కాగా, జెడ్డా నగరాన్ని సందర్శించడం మాత్రం ఇదే తొలిసారి.
ప్రధానమంత్రి రెండవ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ పర్యటనలో భారత్-సౌదీ మధ్య ఆరు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. సౌదీ చక్రవర్తి మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌తో జరగనున్న చర్చల్లో హజ్ కోటా సహా పలు ప్రధాన అంశాలపై ప్రధాన మంత్రి చర్చించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
#WATCH | In a special gesture, fighter planes from Saudi Arabia escort Prime Minister Narendra Modi's plane as it entered Saudi airspace to Jeddah. pic.twitter.com/Vhzxd6ir5p
— ANI (@ANI) April 22, 2025