Page Loader
Modi Road Show: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా తరలివచ్చిన శ్రేణులు
Modi Road Show: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా తరలివచ్చిన శ్రేణులు Modi Road Show: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా తరలివచ్చిన శ్రేణులు

Modi Road Show: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా తరలివచ్చిన శ్రేణులు

వ్రాసిన వారు Stalin
Nov 27, 2023
06:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం హైదరాబాద్‌లో భారీ రోడ్ షో చేపట్టారు. RTC X నుంచి మోదీ రోడ్ షో ప్రారంభమైంది. కాచిగూడ X రోడ్స్ (వీర్ సావర్కర్ విగ్రహం) వరకు కొనసాగింది. సావర్కర్ విగ్రహానికి మోదీ నివాళి అర్పించడంతో రోడ్ షో ముగిసింది. మోదీ రోడ్ షో నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని 25 నియోజకవర్గల నుంచి బీజేపీ శ్రేణులు భారీగా జనసమీకరణ చేశారు. మోదీ రోడ్ షో కాన్వాయ్‌లో 25 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక 25 ప్రచార వాహనాలను ఏర్పాటు చేశారు. మోదీ రోడ్ షో నేపథ్యంలో హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాలలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

మోదీ

గుజరాత్, కర్ణాటక తర్వాత హైదరాబాద్‌లోనే..

ప్రధాని మోదీ ఇలాంటి భారీ రోడ్ షోలను చాలా అరుదుగా నిర్వహిస్తారు. గతంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని భారీ రోడ్ షో చేపట్టారు. ఆ ఎన్నికల్లో బీజేపీ బంపర్ మెజార్టీతో గెలిచింది. ఈ ఏడాది కర్ణాటక ఎన్నికల సమయంలోనూ ప్రధాని మోదీ ఇలాంటి భారీ రోడ్ షో నిర్వహించారు. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. తాజాగా హైదరాబాద్‌లో మరో భారీ రోడ్ షాను నిర్వహించారు. బీజేపీ శ్రేణులు కూడా భారీగా తరలివచ్చారు. అయితే మోదీ రోడ్ షో ప్రభావం హైదరాబాద్ ఓటర్లపై ఉంటుందా? అనేది డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు రోజున తేలనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీ రోడ్ షో