Mohammad Azharuddin: అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి తొలి మంత్రి అయ్యే అవకాశం దక్కించుకున్నారు. ఈ నియామకానికి ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి రాజ్‌భవన్‌లో అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
వివరాలు
రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలంగాణ బీజేపీ నేతలు లేఖ
ఇదిలా ఉండగా,మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దని కోరుతూ తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ పంపించారు. అయితే ఎన్నికల అధికారులు ఈ అంశంపై స్పందిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, అజారుద్దీన్‌ను కేబినెట్‌లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు అధికారికంగా తెలియజేసిన నేపథ్యంలో, ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రేపు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న అజారుద్దీన్..
జూబ్లీహిల్స్ జాతర..
— Prabhakar Venavanka (@Prabhavenavanka) October 30, 2025
రేపు మంత్రిగా ప్రమాణం చేయనున్న అజారుద్దీన్..
(ఎలక్షన్ వస్తే గానీ.. సర్వేల్లో తేడా కొడితే గానీ.. మైనారిటీకి మంత్రి పదవి ముచ్చట యాదికి రాలేదన్నమాట..!) pic.twitter.com/LIBLQEOD2x