
Monkey Meat : నిర్మల్‌లో కోతులను చంపి, వండుకొని తిన్నారు
ఈ వార్తాకథనం ఏంటి
నిర్మల్ జిల్లా బైంసా మండలం చింతల్ బోరి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది.
కొందరు వ్యక్తులు కోతులను చంపి, వండుకొని తిన్నారు.
బిక్షాటన చేసే కొందరు మంగళవారం రాత్రి నాలుగు కోతులను చంపారు.
మాంసాన్ని వండుకొని తలలు, కాళ్లను కాల్చుకు తిన్నారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది.
ఇందులో ఓ వ్యక్తి వచ్చి స్థానికులకు చెప్పాడు. వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు పరిసరాలను చూసి షాక్ అయ్యారు.
నాలుగు కోతులను చంపి తిన్నందుకు గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు.
Details
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
కోతులను తాము దైవంతో సమానంగా పూజిస్తామని, వాటిని చంపి తినడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందగా వారు అక్కడికి చేరుకున్నారు.
అయితే పోలీసులు అక్కడికి వచ్చేసరికి ఆరుగురిలో నలుగురు వ్యక్తులు పరారయ్యారు.
అనంతరం అక్కడే ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.