Page Loader
IMD: 4-5 రోజుల్లో రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉంది: ఐఎండీ
4-5 రోజుల్లో రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉంది: ఐఎండీ

IMD: 4-5 రోజుల్లో రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉంది: ఐఎండీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2025
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

నైరుతి రుతుపవనాలు రాకపై భారత వాతావరణ శాఖ (IMD) ఈ రోజు తాజా అప్‌డేట్‌ను విడుదల చేసింది. రాబోయే నాలుగు నుండి ఐదు రోజుల మధ్యలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరం చేరుతూ ఉంటాయి. అయితే, ఈ ఏడాది మే 27 వరకు నైరుతి కేరళను తాకే అవకాశం ఉందని గతంలోనే వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అంచనా నిజమైతే, 2009 త‌ర్వాత కేర‌ళకు నైరుతి చాలా ముందుగా వ‌చ్చిన‌ట్లు భావిస్తున్నారు.

వివరాలు 

త్రిసూర్ జిల్లాలో ఈరోజు 22 సెం.మీ. వర్షపాతం

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో వచ్చే నాలుగు లేదా ఐదు రోజుల్లోనే నైరుతి రాష్ట్రాన్ని తాకే అవకాశం ఎక్కువగా ఉందని ఈరోజు IMD ప్రకటించింది. నైరుతి కేరళతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాలకు కూడా ఊహించిన కంటే ముందే చేరే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే కేరళలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్టు సమాచారం. ముఖ్యంగా త్రిసూర్ జిల్లాలో ఈరోజు 22 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే కన్నౌరు జిల్లాలో 18 సెం.మీ. వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐఎండీ చేసిన ట్వీట్