
Telangana: జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం భారీ ప్రణాళిక - రూ.33,000 కోట్లతో 15 ప్రాజెక్టులు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా కేంద్ర రోడ్లు,రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) భారీ ప్రణాళికలు రూపొందించింది. కొత్తగా జాతీయ రహదారులు, బైపాస్ రహదారులు,వంతెనలు నిర్మించేందుకు మొత్తం 15 ప్రాజెక్టులపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో ఇప్పటికే 12 ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీకి కన్సల్టెన్సీ సంస్థల కోసం బిడ్లు ఆహ్వానించగా,మిగిలిన మూడు పనులకు త్వరలో బిడ్లు పిలవనున్నారు. ఈ ప్రాజెక్టుల మొత్తం పొడవు 1,123 కిలోమీటర్లుగా ఉండగా,వీటి కోసం ఖర్చు అయ్యే వ్యయం రూ.33,000 కోట్లుగా అంచనా వేయబడింది. కన్సల్టెన్సీ సంస్థల నివేదికల ఆధారంగా పనులను మొదలుపెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మూడు సంవత్సరాల వ్యవధిలోనే ఈ రహదారి పనులను పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
వివరాలు
MoRTH చేపట్టే ప్రాజెక్టుల వివరాలు:
1. ఎన్‌హెచ్-167, 167ఎన్: జడ్చర్ల నుండి కోదాడ వరకు నాలుగు వరుసల రహదారి అభివృద్ధి మహబూబ్‌నగర్ బైపాస్ రహదారి నిర్మాణం 2. ఎన్‌హెచ్-63: నిజామాబాద్ నుండి జగ్‌దల్‌పూర్ వరకు రహదారి అభివృద్ధి బోధన్-నిజామాబాద్ మధ్య రహదారి విస్తరణ వంతెనలు,బ్రిడ్జిల నిర్మాణం 3. ఎన్‌హెచ్-765డి: హైదరాబాద్ ORR నుంచి మెదక్ వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం మెదక్ బైపాస్ నిర్మాణం 4. ఎన్‌హెచ్-30: రుద్రంపూర్ నుండి భద్రాచలం వరకు నాలుగు వరుసల రహదారి కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో బైపాస్ రహదారుల నిర్మాణం 5. ఎన్‌హెచ్-365, 365బీ, 365బీబీ: నకిరేకల్ నుండి తానంచర్ల వరకు రహదారి, బ్రిడ్జి పనులు సూర్యాపేట-జనగామ సెక్షన్‌లో నాలుగు వరుసల రహదారి ఖమ్మం నుంచి సత్తుపల్లి వరకు రహదారి అభివృద్ధి
వివరాలు
MoRTH చేపట్టే ప్రాజెక్టుల వివరాలు:
6. ఎన్‌హెచ్-61: కల్యాణ్ నుంచి నిర్మల్ వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం 7. ఎన్‌హెచ్-563: ఖమ్మం నుంచి వరంగల్ వరకు నాలుగు లైన్ల రహదారి అభివృద్ధి 8.ఎన్‌హెచ్-163: మన్నెగూడ-రావులపల్లి సెక్షన్ మధ్య నాలుగు వరుసల రహదారి పనులు హైదరాబాద్ నుండి భూపాలపట్నం వరకు పలు ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, వంతెనల ఏర్పాటు 9.ఎన్‌హెచ్-353సి: పరకాల, భూపాలపల్లి ప్రాంతాల్లో బైపాస్ రహదారుల నిర్మాణం