Page Loader
Mudragada Padmanabham: ముద్రగడ వైఎస్సార్‌సీపీలో చేరిక వాయిదా.. తాడేపల్లికి ర్యాలీ రద్దు..! 
ముద్రగడ వైఎస్సార్‌సీపీలో చేరిక వాయిదా.. తాడేపల్లికి ర్యాలీ రద్దు..!

Mudragada Padmanabham: ముద్రగడ వైఎస్సార్‌సీపీలో చేరిక వాయిదా.. తాడేపల్లికి ర్యాలీ రద్దు..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2024
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా మార్చి 14న కాకుండా మార్చి 15 లేదా 16 తేదీల్లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ముద్రగడ ప్రకటించారు. బుధవారం అభిమానులకు రాసిన లేఖలో పలు విషయాల్ని ప్రస్తావించారు. మార్చి 14న జరగాల్సిన ర్యాలీని రద్దు చేసుకున్నానని,మార్చి15 లేదా 16 తేదీల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఒంటరిగా కలుస్తానని, వైఎస్సార్‌సీపీలో చేరతానని, ఆయన ఆశీస్సులు కూడా తీసుకుంటానని ముద్రగడ అభిమానులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇందుకు మీ అందరి ఆశీస్సులు ఉండాలంటూ అభిమానుల్ని కోరారు. ఈ మేరకు అపాయింట్ మెంట్ ఖరారు కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మార్చి 15 లేదా 16 తేదీల్లో వైసీపీలోకి ముద్రగడ