LOADING...
పన్నుల ఎగవేత విషయంలో.. హయర్ కార్యాలయాలపై ఐటీ దాడులు
పన్నుల ఎగవేత విషయంలో.. హయర్ కార్యాలయాలపై ఐటీ దాడులు

పన్నుల ఎగవేత విషయంలో.. హయర్ కార్యాలయాలపై ఐటీ దాడులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2023
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాకు చెందిన గృహోపకరణాల తయారీ సంస్థ హయర్ కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, నోయిడా, పుణేతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర బ్రాంచ్‌లోని హయర్ ఆఫీసుల్లో ఈ సోదాలను చేస్తున్నారు. హయర్ పెద్ద మొత్తంలో పన్నులను ఎగ్గొట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ కార్యాలయంలో ఐటీ దాడులు దాడులు చేస్తున్నారు. ఈ దాడులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Details

ప్రపంచ నంబర్ 1 బ్రాండ్ గా హయర్

గృహోపకరాల మార్కెట్లో గత 14 సంవత్సరాలుగా హయర్ ప్రపంచ నంబర్ 1 బ్రాండ్ గా నిలిచిన విషయం తెలిసిందే. అప్లయన్సెస్ ఇండియా గ్లోబల్ లీడర్‌గా హయర్ ముందుకు దూసుకుపోతోంది. దేశంలో వినియోగదారుల కోసం హయర్ ఎన్నో వినూత్నమైన ఉత్పత్తులను అందిస్తోంది. అయితే పన్నుల ఎగవేత విషయంలో ప్రస్తుతం హయర్ కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

Advertisement