Dress Code: బురఖాపై ఆంక్షలు విధించిన ముంబై కాలేజీ.. కొత్త డ్రెస్ కోడ్‌తో వివాదం
ముంబైలోని ఓ కళాశాల కొత్త షరతును అమలు చేసింది. విద్యార్థినులు బురఖా ధరించి కాలేజీ రావడాన్ని నిషేధం విధించింది. యునిఫాం పాలసీలో భాగంగా బురఖా ధరించి కాలేజీకి రాకూడదని స్పష్టం చేసింది. దీంతో పలువురు విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కాలేజీ గేట్ ముందు నిరసనకు దిగారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారి తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఎన్‌జీ ఆచార్య ఆండ్ డీకే మారాఠే కాలేజీ కొత్తగా యూనిఫాం పాలసీని ప్రవేశపెట్టడం గమనార్హం. బుర్ఖాలు ధరించిన విద్యార్థినులు క్యాంపస్ లోకి రాకూడదని ఆదేశాలు జారీ చేసింది.
డ్రెస్ కోడ్ ను కొంతమంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు
విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తల్లిదండ్రులు, కళాశాల అధికారులతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొత్త డ్రెస్ కోడ్ విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులతో మే 1న సమావేశం నిర్వహించామని, బురఖా, హిజాబ్, స్కార్ఫ్‌లు, స్టిక్కర్ లపై నిషేధంతో సహీ ప్రతి విషయాన్ని సుక్ష్మంగా వివరించామని కళాశాల ప్రిన్సిపల్ విద్యాగౌరీ లేలే వెల్లడించారు. అప్పుడు డ్రెస్ కోడ్ కు అందురూ అంగీకరించారని, ప్రస్తుతం కొంతమంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. బాలికలు తరగతి గదిలోకి ప్రవేశించే ముందు బుర్ఖా తీసివేయాలని, మళ్లీ సాయంత్రం వెళ్లేటప్పుడు బురఖా ధరించవచ్చని పేర్కొన్నారు.