Page Loader
Ice cream: నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకోగానే ఖంగుతున్న లేడీ.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు

Ice cream: నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకోగానే ఖంగుతున్న లేడీ.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2024
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని మలాడ్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్ కోన్‌లో ఒక మహిళ మనిషి వేలిని గుర్తించింది. ఆమె సోదరుడు ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావ్ కోసం యుమ్మో ఐస్ క్రీమ్ కంపెనీ నుండి ఈ ఐస్ క్రీం ను ఆమె కొనుగోలు చేసింది. సెర్రావ్, 27 ఏళ్ల వైద్యుడు,మలాడ్ నివాసి, తన బటర్‌స్కోచ్ ఐస్‌క్రీమ్‌లో మనిషి సగం వేలిని కనుగొన్నాడు.

విచారణ జరుగుతోంది 

దర్యాప్తు చేపట్టిన పోలీసులు 

ఘటనపై మహిళ వెంటనే మలాడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు యమ్మో ఐస్‌క్రీం కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయాన్ని తాము సీరియస్‌గా తీసుకున్నామని, ఐస్‌క్రీమ్‌ను తయారు చేసి ప్యాక్ చేసిన ప్రదేశంపై కూడా విచారణ జరుపుతామని సీనియర్ పోలీసు అధికారి ధృవీకరించారు.

ఫోరెన్సిక్ విశ్లేషణ 

ఫోరెన్సిక్ ల్యాబ్ కి ఐస్‌క్రీమ్‌ 

మలాడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐస్‌క్రీమ్‌లో లభించిన మానవ వేలిని తదుపరి పరీక్ష కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపారు. కాగా, ఐస్ క్రీం కోన్ ఫోటో, ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఆహార భద్రతా ప్రమాణాలపై స్థానిక నివాసితులలో ఆందోళనకు దారితీసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పిక్ ఇదే