'ప్రీమియర్ పద్మి' టాక్సీకి బై.. బై.. ముంబైలో ఒక శకం ముగిసింది.. 6దశాబ్దాల బంధానికి తెర
ముంబై.. ఈ పేరు వినగానే అందరికీ సాధాణరంగా గుర్తుకు వచ్చేది నలుపు, పసుపు రంగులో కనిపించే ట్యాక్సీలు. దాదాపు 60ఏళ్లుగా అవి ముంబైతో బలమైన బంధాన్ని పెనవేసుకున్నాయి. 'ప్రీమియర్ పద్మిని'గా పిలవబడే ఈ 'కాళీ-పీలీ' టాక్సీలు.. ఇక మీదట ముంబై రోడ్ల మీద కనపడవు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు ముంబై రోడ్ల రయ్.. రయ్ మంటూ తిరిన ఈ ట్యాక్సీలు అక్టోబర్ 30 నుంచి కనపడవు. ముంబైలో క్యాబ్‌ల కాల పరిమితి 20 ఏళ్లు. దీంతో డీజిల్ వెర్షన్ అయిన 'ప్రీమియర్ పద్మి' ట్యాక్సీలు క్రమంగా నిష్క్రమిస్తూ వస్తున్నాయి.
2003 అక్టోబర్ 29న చివరి ట్యాక్సీ రిజిస్ట్రేషన్
ముంబైలో 40,000 'ప్రీమియర్ పద్మి' ట్యాక్సీలు తిరుగుతున్నాయి. వీటిలో చివరగా MH-01-JA-2556 నంబర్ కలిగిన ట్యాక్సీ రిజస్టర్ అయ్యింది. దీని రిజిస్ట్రేషన్ టార్డియో ఆర్టీఓ కార్యాలయంలో 2003 అక్టోబర్ 29న జరిగింది. దీని కాలపరిమితి 2023, అక్టోబర్ 29తో ముగిసింది. చివరి 'ప్రీమియర్ పద్మి' ట్యాక్సీ ఓనర్ పేరు అబ్దుల్ కరీమ్ కర్సేకర్. ఈ సందర్భంగా కరీమ్ మాట్లాడుతూ.. ఇది ముంబైకు, తన జీవితానికి గర్వకారణం అన్నారు. బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) సంస్థకు చెందిన డబుల్ డెక్కర్ బస్సులను పూర్తిగా ప్రజా రవాణా నుంచి రవాణా శాఖ తొలగించింది. ఇది జరిగిన కొన్ని రోజల తర్వాత ఇప్పుడు 'ప్రీమియర్ పద్మి' ట్యాక్సీల శకం ముగియడం గమనార్హం.
'ప్రీమియర్ పద్మి' ట్యాక్సీని మ్యూజియంలో పెట్టాలి
దాదాపు 60ఏళ్ల పాటు ముంబై వాసులకు సేవలందించిన 'ప్రీమియర్ పద్మి' ట్యాక్సీని గుర్తుగా రోడ్డుపై లేదా మ్యూజియంలో భద్రపరచాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. 'ప్రీమియర్ పద్మి' ట్యాక్సీలు రోడ్లపై నిష్క్రమించినప్పుటీకీ.. ముంబై ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందని పరేల్ నివాసి, కళా ప్రేమికుడు ప్రదీప్ పలావ్ అన్నారు. అయితే ట్సాక్సీ డ్రైవర్ యూనియన్లు మాత్రం.. 'ప్రీమియర్ పద్మి' ట్సాక్సీలు బంద్ కావడానికి ప్రభుత్వాలే కారణమని ఆరోపిస్తున్నాయి. గతంలో తాము ప్రభుత్వానికి చెప్పినా.. పట్టించుకోలేదని ముంబై టాక్సీమెన్స్ యూనియన్ పేర్కొంది.