ప్లాస్టిక్ సంచిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం; కుమార్తెపైనే అనుమానాలు
ముంబయిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లాల్‌బాగ్ ప్రాంతంలో 53 ఏళ్ల మహిళ మృతదేహం ప్లాస్టిక్ సంచిలో లభ్యమైంది. మృతదేహాన్ని నెలల తరబడి గదిలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతురాలు కుమార్తెపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి సోదరుడు, మేనల్లుడు మంగళవారం కాలాచౌకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు డీసీపీ ప్రవీణ్ ముండే తెలిపారు.
మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించిన పోలీసులు
లాల్‌బాగ్ ప్రాంతంలో మహిళ, ఆమె కుమార్తె నివాసం ఉంటున్నఅపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ బ్యాగ్‌లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం కనిపించింది. పోలీసులు మహిళ కుమార్తెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసి ఇలా ఇళ్లలో మృతదేహాలు దాచిన సంఘటనలు ఇటీవల అనేక వెలుగు చూశాయి.