
Mumps cases increase in Delhi: ఢిల్లీలో మంఫ్ కేసులు పెరుగుతున్నాయి...జాగ్రత్తలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ (Delhi)లో గత కొద్ది వారాలుగా మంఫ్ కేసులు(Mumps Cases)పెరుగుతున్నాయి.
వయోవృద్ధులు ,చిన్నారులు ఎక్కువగా కనిపించే ఈ మంఫ్ కేసులు ఇప్పుడు ఢిల్లీని వణికిస్తున్నాయి.
మంఫ్ వైరస్, పారామాక్సీ వైరస్ కారణంగా ఈ మంఫ్ వ్యాధి వస్తుంది .
ఊపిరితిత్తుల్లోని డ్రాప్లెట్స్,ముక్కు నుంచి వచ్చే కణాలు, ఉమ్మి, వ్యాధితో బాధపడే వారి నుంచి వచ్చే గాలి వల్ల కూడా ఈ వ్యాధి సోకుతుంది.
జన సమూహాలు ఎక్కువగా ఉన్నచోట, టీకాలు వేయించుకోని వారిలోనూ, అపరిశుభ్ర వాతావరణంలోనూ ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.
వ్యాక్సినేషన్ వేయించుకోని చిన్నారుల్లోనూ గర్భిణీ లకు ఈ వైరస్ ప్రమాదకరంగా మారుతుంది.
ఈ వైరస్ సోకిన వారికి గొంతు వాపు, చెవుల కింద వాపు, గ్లాండ్స్ వాపులు ఉంటాయి.
Mumps Delhi
వ్యాక్సిన్ తీసుకుంటే ఓకే...
గర్భిణీలకు ఈ వైరస్ సోకితే గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది.
చిన్నప్పుడే టీకాలు వేసుకున్నట్లయితే పెద్దగా ఆందోళన అవసరం లేదని రూబీ హాల్ క్లినిక్ లోని నియోనా టాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ ఉదావంత్ తెలిపారు.
తలపోటు, జ్వరం, కండరాల నొప్పులు, ఆయాసం, ఆకలి లేకపోవడం, నమలడంలోనూ మింగడంలోనూ తీవ్ర నొప్పి ఉంటుంది.
టీకా ద్వారా మంఫ్ వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చు చిన్నప్పుడే మజిల్స్, మంఫ్, రూబెల్లా వాక్సిన్స్ని వేసుకున్న వారు నిశ్చింతగా ఉండొచ్చు.
వ్యాక్సినేషన్ వేయించుకోని వారు వయోవృద్ధులు ఈ వైరస్ పట్ల జాగ్రత్త వహించాలి.
వ్యాధి సోకిన వారు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.
ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి.
డాక్టర్లను సంప్రదించి ఆయన సూచించిన ప్రకారం మందులు తీసుకోవాలి.