
తెలంగాణ: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమీక్ష.. ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మహానగరంలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఈ మేరకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. జలమండలి, విద్యుత్, రెవెన్యూ , ట్రాఫిక్ పోలీస్, డీఆర్ఎఫ్ తదితర విభాగాలు సమన్వయం చేసుకోవాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రథమ కర్తవ్యంగా చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటిని తోడేందుకు డీవాటరింగ్ పంపులు సిద్ధం చేశామని, సిబ్బందిని సైతం మోహరించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రథమ కర్తవ్యం:కేటీఆర్
ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి @KTRBRS పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని కేటీఆర్ ఆదేశించారు.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 19, 2023
ఈరోజు నానక్ రామ్ గూడా లోని హెచ్‌జిసీఎల్… pic.twitter.com/yzzrCx9uhl